గద్వాల పట్టణంలో ప్రభంజనం సృష్టిస్తున్న సరితమ్మ గడపగడప ప్రచారం…

Spread the love

పట్టణంలోని 2వ.3వ. వార్డ్ లలో ప్రచారం…*
కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ..
గద్వాల పట్టణంలోని 2వ,3వ వార్డ్ లలో కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ గడపగడప ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను సరితమ్మ అభ్యర్థించారు…
నడిగడ్డ బహుజన బిడ్డల ఆత్మగౌరవం,విద్య, వైద్యం అభివృద్ధి సంక్షేమం కోసం ఒక్కసారి అవకాశం ఇస్తే గద్వాల కోటపైన బహుజన జండా ఎగురవేసి గద్వాల అభివృద్ధికి బంగారు బాటలు వేసుకుందామని సరితమ్మ అన్నారు…కుటుంబ పాలనలో నడిగడ్డకు అభివృద్ధి ఏమి జరగలేదని, బంగ్లా కుటుంబ పాలనను ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి గద్దె దించాలని సరితమ్మ కోరారు. నడిగడ్డ మార్పు కోసం నడిగడ్డ ప్రజల ఆకాంక్ష కోసం, విద్య,వైద్యం,అభివృద్ధి, సంక్షేమం కావాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమని కావున జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలబడి గద్వాల కోటపైన బహుజన జెండాను ఎగరవేస్తామని ఆశీర్వదించాలని కోరారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లు,500 గ్యాస్ సిలిండర్,2500 మహిళలకు ప్రతి నెల సహాయం,రైతు భరోసా క్రింద ప్రతి ఎకరాకు రైతుకు 15000, కౌలు రైతులకు 12000,విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా తదితర సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు…

ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజిపేట్ శంకర్, మధుసూదన్ బాబు,నల్లారెడ్డి, ఇషాక్,యూసుఫ్,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,జ్యోత్స్న కిషోర్ యదవ్, నాగేంద్ర యాదవ్,భాస్కర్ యాదవ్, గంజిపేట్ తిమ్మన్న,తిమోతి, రాము యాదవ్, కరాటే సత్యం,నాగ శంకర్, మహిమూద్,నందు,దినేష్,బంగి నవీన్,వెంకటస్వామి ఆచారి, జహంగీర్,జమల్,రాము, సమీర్,అప్సర్,కొత్త గణేష్, షాష, రాఘవేంద్ర, మనోజ్, గంజి రాము, జనార్థన్ గౌడ్,కిఫాయిత్,రాంపురం రాఘ,భీసన్న, రామకృష్ణ,బుడకల ప్రకాష్, సి.వై అనిల్,సాంబ గౌడ్, ఆనంద్ గౌడ్, పరమేష్, కృష్ణారెడ్డి, నరిసింహులు, కేకే శేఖర్, గోపాల్,అఫీజ్, తదితరులు ఉన్నారు

Whatsapp Image 2023 11 16 At 1.20.29 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page