శంకర్పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్ గడువు మార్చి 31 ఆదివారంతో ముగిసిందన్నారు. వీధి వ్యాపారస్తులందరూ కాంట్రాక్టర్ కు ఫీజు చెల్లించవద్దని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మున్సిపల్ సిబ్బంది వారిచే తై బజార్ ఫీజు వసూలు చేయబడునని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపామని, కలెక్టర్ కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చే వరకు మున్సిపల్ సిబ్బంది తై బజార్ ఫీజు వసూలు చేయబడునని తెలిపారు. ఈ విషయాన్ని వీధి వ్యాపారస్తులందరూ గ్రహించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు.
శంకర్పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…