కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు

Spread the love

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ లోని SVIT ఆడిటోరియంలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి BRS పార్టీ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సభలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్, మాజీ హోమంత్రి మహమూద్ అలీ, MLA లు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేవలం అధికారంలోకి రావాలనే ఆలోచనతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, 4 వేల రూపాయల పెన్షన్, ధాన్యానికి బోనాల్ వంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించారని, వాటిని అమలు చేయాలంటే వారి జీవితకాలం సమయం కూడా సరిపోదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ పై అర్ధరహితమైన విమర్శలు చేస్తూ హామీల అమలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

100 రోజులలలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అమలు చేసే వరకు ప్రజల భాగస్వామ్యంతో వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వం పై వత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో BRS ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చిన నాటి నుండి జరగని అభివృద్ధి కార్యక్రమాలు కూడా 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. BRS పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. హైదరాబాద్ నగరం కూడా నాటి మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. జరిగిన అభివృద్ధి తోనే ప్రజలు అన్ని అసెంబ్లీ స్థానాలలో BRS ను గెలిపించారని చెప్పారు.

అన్నింటికీ మీకు నేనున్నా….తలసాని

తన గెలుపుకోసం ఎంతో కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమొచ్చినా తాను అన్నింటికీ అండగా ఉంటానని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలను లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, ఉప్పల తరుణి, కిరణ్మయి, డివిజన్ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, హన్మంతరావు, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నాయకులు లలితా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page