ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ లో సర్వజ్ఞ విద్యార్థి ప్రతిభ

Spread the love

ఉమ్మడి ఖమ్మం సాక్షిత

స్థానిక వి.డి.యోస్ కాలనీలోగల సర్వజ్ఞ పాఠశాల 5వ తరగతి విద్యార్ధి ఎమ్. అక్షద్రుత్విక్, ప్రక్యాత ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ పోటి పరీక్షలో సర్వజ్ఞ విద్యార్ధి జిల్లా టాపర్ నిలిచాడు. ఈ పరీక్షలో ఇంగ్లీష్ విభాగంలో మా విద్యార్ధికి 50గాను 44మార్కులతో ప్రథమస్థానంలో నిలిచాడు.


ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరక్టర్ కె. నీలిమా, పాఠశాల ప్రధానఉపాధ్యాయురాలు కె. మానస విద్యార్థిని అభినందించారు. చైర్మన్ ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థి ఎమ్. అక్షడ్రుత్విక్ ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉంది అన్నారు. సుమరు 1500 పాఠశాలల నుండి వచ్చిన 500మంది విద్యార్థులలో తమ పాఠశాల విద్యార్ధి టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉందాన్నారు.

విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను ప్రతిభను విద్యార్థి దశలోనె గుర్తించి వారిని ప్రోత్సాహించడం ద్వారా వారు భవిష్యత్తులో ఎదుర్కోనబోవు పోటి పరీక్షలను సునాయాసంగా ఎదుర్కొని వారు వారి లక్ష్యాలను సాధించడంలో సర్వజ్ఞ స్కూల్ తర్ఫీదు ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ కె. నీలిమా మాట్లాడుతు సర్వజ్ఞలో చదువుతో పాటు అన్నీ విషయలనీ నేర్చుకోవడం ద్వారా నవసమాజ నిర్మాతలుగా మారగలరని ఆశభవం వ్యక్తంచేశారు.
సర్వజ్ఞ పాఠశాల విద్యార్ధి ఎమ్. అక్షద్రుత్విక్, శనివారంనాడు శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అవార్డుప్రధానోత్సవంలో పాల్గొని జిల్లా టాపర్గా జ్ఞాపికను మరియు ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. విద్యార్థి ప్రతిభకు సంతోషించి సర్వజ్ఞ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందిచారు.

Related Posts

You cannot copy content of this page