ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్

Spread the love

ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్.. రెండు కేటగిరీలుగా నగదు పంపిణీ.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక.. వృద్ధులు.. ఇతర పెన్షన్ దారులు గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర భారీగా బారులు తీరారు. ఎండాకాలం కావడంతో.. ఉదయమే వచ్చి సచివాలయాల దగ్గర వెయిట్ చేస్తున్నారు.

ప్రతినెలా ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ అందించేవారని, ఈసారి మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు పెన్షన్ దారులు. ఈనెల 6వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది. సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, వృద్ద వితంతువుల‌కు ఇంటి దగ్గరకే వెళ్లి.. పెన్షన్లను అందించనున్నారు. మిగతా వారికి గ్రామ సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తారు. సచివాల‌యాల‌కు చాలా దూరంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం.. తాజా ఆదేశాలతో రాత్రి 7గంటల వరకు పనిచేయనున్నాయి సచివాలయాలు.

ఏపీలో 2లక్షల 66వేల 158మంది వాలంటీర్లు ఉంటే.. ల‌క్షా 27వేల 177 మంది మాత్రమే స‌చివాల‌య సిబ్బంది ఉన్నారని అంటోంది ప్రభుత్వం. స‌చివాల‌య సిబ్బందిలో కొంత‌మంది బీఎల్‌వోలుగా ఎన్నిక‌ల విధులు నిర్వహిస్తున్నారు. స‌రిప‌డా సిబ్బంది లేక‌పోవ‌డంతో రెండు కేట‌గిరీలుగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయరాదన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ తరహా ఏర్పాట్లు చేసింది.

కోర్టును ఆశ్రయించిన వృద్ధులు..

మరోవైపు, ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు పెన్షనర్స్‌. వాలంటర్లతో పెన్షన్లు పంపిణీ చేయకుండా కమిషన్‌ ఆదేశాలు ఇవ్వడంపై పిటిషన్‌ వేశారు. ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే తాము ఇబ్బందులు పడతామంటూ కోర్టును ఆశ్రయించారు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు. ఎన్నికల సంఘం ఆదేశాలను నిలుపుదల చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు రానుంది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page