Agricultural land should be divided into clusters according to area:
వ్యవసాయ భూమి విస్తీర్ణం ప్రకారం క్లస్టర్లుగా విభజించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.
వ్యవసాయ భూమి విస్తీర్ణం ప్రకారం సిరిపురం మరియు వీర్లపల్లి ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడారు.
గ్రామంలోని పాడు బడ్డ ఇండ్లు, పెంటకుప్పలు మరియు పిచ్చిమొక్కలు తొలగించి, గ్రామాన్ని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
ప్రజలకు విద్యుత్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తూ… ఉండాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు.
గ్రామంలోని 2, 3వ వార్డులలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, ప్రజలకు సరిపడా నీటిని అందించాలని, త్రాగునీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలని, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు, లీకేజీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కార్మికులకు డబ్బులు చెల్లించలేనటువంటి వారికి వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలో ఉంచాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు భీమా పథకం ద్వారా సిరిపురం గ్రామంలో ఇప్పటివరకు 30 మందికి (రూపాయలు ఒక కోటి యాభై లక్షలు) అందించడం జరిగిందని, రైతు బంధు పథకం ద్వారా 18 కోట్లు అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.