అంగలూరు గ్రామం నందు అగ్రహార భూములకు నిర్వహించిన సర్వే కార్యక్రమం

Spread the love


Agrarian land survey program in Angaluru village

*సాక్షిత : * వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం నందు అగ్రహార భూములకు నిర్వహించిన సర్వే కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనాం, అగ్రహారం భూముల పై రైతులకి హక్కు కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి ఈ ఈనాం,

అగ్రహారం భూముల గురించి మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహకారంలో ఈ ఈనాం, అగ్రహారం భూములను సాగుచేసుకుంటున్న రైతులకి హక్కు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్నాని మీ భూమిపై మీకు హక్కు కల్పించేందుకు ఎంత కష్ట, నష్టాలను అయిన లెక్కచేయనని ఎంత దూరం వెళ్ళైనా ఈ హక్కుని రైతులకి కల్పిస్తానని అన్నారు.

గ్రామ ప్రజలందరికి విన్నవించుకునే ముఖ్య విషయం గ్రామంలో రీసర్వే జరిగే సమయంలో రైతులందరు అందుబాటులో ఉండి వారి పొలం హద్దులను, వారికి వారి భూమికి సంబంధించి పత్రాలు ఏమైనా ఉంటే సర్వే అధికారులకి తెలియపరచి ఈ రీసర్వేకి సహకరించవలసినదిగా కోరారు.

Related Posts

You cannot copy content of this page