సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండల పరిధిలో నేరడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఏఈఓ నజ్మ క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు అని అడిగి తెలుసుకుని వివరాలను నమోదు చేసుకున్నారు ప్రతి ఎకరం మొక్కజొన్న సాగు చేసే పొలాలని పరిశీలిస్తానని ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడొద్దని కౌలు చేసే రైతుల దగ్గర నుంచి పొలం పట్టదారి పాస్ పుస్తకం బ్యాంకా అకౌంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ లు అడిగి తీసుకుంటున్నామని ఆమె తెలియపరిచారు అలాగే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కశ్చితంగా రైతుల ఖాతాలో జమ అవుతుందని రైతులు ఎవరూ అధైర్య పడవద్దని వారికి బరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నున్న శంకర్రావు, వంకాయలపాటి సత్యం, గోగుల భాస్కర్, మెరుగు రవి, గొర్రెమచ్చు అంతోని, రైతులు పాల్గొన్నారు