Additional Collector Mogili Snehalatha started the Sanitary Napkin Unit
సానిటరీ నాప్కిన్ యూనిట్ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
దళితబంధు పథకం లబ్ధితో అనతికాలంలోనే ఆర్థికాభివృద్ధి చెందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు అనిల్ కుమార్ తనకు మంజూరయిన సానిటరీ నాప్కిన్ యూనిట్ను ఖమ్మం నగరం శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేయగా అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అనుభవం కలిగిన యూనిట్ స్థాపనతో ఆర్థికాభివృద్ధి పొంది నలుగురికి ఉపాధి కల్పించడం ద్వారా లబ్ధిదారునితో పాటు ఉపాధి పొందిన వారు ఆర్ధికంగా బలోపేతం కావడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి కొండపల్లి శ్రీరామ్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.