SAKSHITHA NEWS

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు మిల్లర్ల యజమానులకు సూచించారు.
చిట్యాల పట్టణంలో ఉన్న హనుమాన్ రైస్ మిల్, ఉదయ్ రైస్ మిల్, వరలక్ష్మి రైస్ మిల్ పరమేశ్వరి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్, సిద్ధార్థ రైస్ మిల్ లని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యమును త్వరగా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్నటువంటి అందరు రైస్ మిల్లర్స్ 100 శాతం టార్గెట్ అయిపోయినప్పటికీ కూడా 150 శాతం వరి దిగుమతిని చేసుకోవాలని మిల్లర్ ల యజమానులను కోరారు.
వరి ధాన్యం త్వరిత గతిన దిగుమతి చేసుకోవాలని లేని పక్షంలో మిల్లర్లపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు 200 నుంచి 800 లారీల తో వరి ధాన్యం సెంటర్ ల నుంచి మిల్లర్లకి ఎగుమతి జరుగుతున్నదని 66,858 రైతుల నుంచి 47,0726 మెట్రిక్ టన్నుల వరి ధాన్యమును కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో వివిధ ఖాళీగా ఉన్న గోదామ్స్ గుర్తించి ధాన్యం నిలువ చేయుటకు గుర్తించనైనదని వర్షము వచ్చు సూచనలు ఉండటంవల్ల సెంటర్ ఇంచార్జి లు, మరియు రైతులకు కు వరి ధ్యానము తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీఎం లు సూపర్వైజర్లు ఆఫీసర్లు విధిగా సెంటర్లని విసిట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సెంటర్ ఇన్చార్జిలు ఎండలు ఎక్కువ ఉండటం వలన రైతుల కోసం సెంటర్లలో తాగటానికి నీళ్లు, ఉండటానికి షెల్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లై ఆర్ఐ లింగస్వామి, అదనపు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఎండి రఫీద్, అధికారులు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS