Actions if private persons go down in man holes
ప్రైవేటు వ్యక్తులు మ్యాన్ హోల్స్ లో దిగితే చర్యలు తప్పవు – కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మాన్
హోల్స్ లో తమ కార్మికులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు తమ అనుమతి లేనిదే దిగరాదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఓక ప్రకటనలో తెలిపారు.
మ్యాన్ హోల్స్ బ్లాక్ అయినప్పుడు ప్రైవేటు వ్యక్తుల ద్వారా శుభ్ర పరచుట వలన ప్రమాధాలు
సంభావిస్తున్నాయని, నగరములో ఎక్కడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజి బ్లాక్ అయినప్పుడు తమ కార్మికులు అన్ని జాగ్రత్తలు తీసుకున్న పిదప, సంబందిత డిఈలు కమిషనర్ అనుమతితో స్వయం పరిశీలనలో క్లీనింగ్ ప్రకియ చేపడుతారని కమిషనర్ అనుపమ తెలిపారు.
మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం, వారి పునరావాస చట్టం, 2013 సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మాన్యువల్ క్లీనింగ్ చేయడం
నిషేధించబడిందని, యాంత్రిక వ్యవస్థ ద్వారా శుభ్ర పరచవలసినదిగా
తెలిపియున్నారు. కొన్ని ప్రాంతాలలో యంత్రాలతో సాధ్యం కాకపోతే కమీషనర్ నుండి ముందస్తు వ్రాతపూర్వక అనుమతులు పొందాలన్నారు.
అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన, సక్రమంగా సన్నద్ధమైన వ్యక్తిగత రక్షణ
గేర్ వర్కర్లను మాత్రమే నియమించడం జరుగుతుందన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మాన్
హోల్స్ బ్లాక్ అయినప్పుడు ప్రైవేటు వ్యక్తుల ద్వారా శుభ్ర పరచకూడదని, అట్లు సంభవించిన
ప్రమాధములకు నగరపాలక సంస్థ భాధ్యులు కారని తెలియజేస్తూ వారిపై మాన్యువల్
స్కావెంజర్ల సంక్షేమం 2013 ప్రకారము చర్యలు
తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి హెచ్చరికలు జారీ చేసారు.