ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించండి

Spread the love
Contribute to a plastic free society

ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించండి.

  • కమిషనర్ అనుపమ
    సాక్షిత : ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి పిలుపునిచ్చారు.

  • ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్లెక్సీ వ్యాపారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 1 వ తేదీ నుండి నగరంలో ప్లాస్టిక్ బ్యాన్ పక్కాగా అమలు చేస్తామన్నారు.
  • ఇందుకు నగరంలోని అందరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లెక్సీల స్థానంలో గుడ్డ బ్యానర్లు వేసేందుకు అందరూ సిద్ధమవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నగరంలో ఎక్కడైనా ప్లాస్టిక్ ప్లెక్సీలు వస్తే ప్రింట్ చేసిన వారిపైనే, ఏర్పాటు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • ఈ ప్లాస్టిక్ బ్యాన్ కు నగర ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, వివిధ సంస్థ వ్యాపారులు సహకరించాలన్నారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి యంత్రాలు కొనుగోలు చేశామని, ఈ సాఫ్ట్వేర్ మార్చడం, క్లాత్ వచ్చే వరకు సమయం ఇవ్వాలని కోరారు.
  • దీపావళి తరువాత మరోమారు సమావేశం నిర్వహిస్తామని ఈ లోపు ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ మార్పు తదితరాలను సిద్ధం చేసుకోవాలన్నారు.
    ఈ సమావేశంలో నగరంలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page