ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం

Spread the love

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. BRS పార్టీ పిలుపు మేరకు బుధవారం అమీర్ పేట లోని మైత్రివనం వద్ద నిర్వహించిన ధర్నా లో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద కుటుంబాలను ఇబ్బందులు పెట్టొద్దనే ఉద్దేశంతో BRS ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో LRS జోలికి వెళ్లలేదని పేర్కొన్నారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉచితంగా LRS రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని మరిచి LRS పేరుతో 25 లక్షల కుటుంబాలపై ఆర్థికభారం మోపి 20 వేల కోట్ల రూపాయల వరకు దోపిడీ చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. నాడు LRS పై మాట్లాడిన నేటి మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా LRS చేయాలని, అప్పటి వరకు మా ప్రభుత్వం పై ఆందోళన కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ధర్నా అనంతరం HMDA కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page