ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారీగా

Spread the love

Accessible to the public and accountable to the public

ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ వారి మన్ననలు పొందే లాగా పని చేయడం పోలీసు ప్రధాన లక్ష్యం.

పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్.,

గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్

రామగుండంపోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి మొదట పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు . పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ సిపి మేడం కి వివరించారు.


అనంతరం సిపి మేడమ్ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.

ఆన్ లైన్ వినియోగించు విధానముపై అందరికి అవగాహన ఉండాలని,TS COPs ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి పెండింగ్ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

ఆధునిక కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం వలన అమ్మాయిలకు ఆన్లైన్ లో ద్వారా వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి వాటిపై పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలు షీ టీమ్స్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిషనర్ పరిధిలోని ప్రతి విద్య సంస్థలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలలో, అమ్మాయిలు లలో చైతన్యం కల్పించడం జరుగుతుందన్నారు.

కమిషనరేట్ పరిధిలోని కమ్యూనిటీ సిసి టీవీ ప్రాజెక్ట్ మరియు నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ గతంలో కెమెరాలు ఏర్పాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మొత్తంలో నూతన సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పునరుద్ధరణ చేస్తూ, మంచిగా పని చేసే విధంగా చర్యలు తీసుకొంటాం. ప్రజలకు రక్షణ, భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కోసం పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం, ఇంగ్లీష్టిగేషన్ క్వాలిటీ పెంచడం కోసం నూతన డిజిపి ఆధ్వర్యంలో ట్రైనింగ్, అధునాతన ఎక్విమెంట్స్ అధికారులకి ఇప్పించడానికి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారు అట్టి ఉద్దేశాన్ని, నూతన ఆవిష్కరణలను క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు చేరే విధంగా ఒక బాధ్యతగా తీసుకొని పనిచేయడం జరుగుతుందన్నారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పనిచేయడానికి పని నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడి ప్రజలందరూ చాలా మంచివారు అని అన్నారు.

సింగరేణి Ocp -3 వ్యూ పాయింట్, CHP లను ని సందర్శించి సింగరేణి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది.

సుందిళ్ల లోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, ఇన్స్పెక్టర్ వేణు గోపాల్. ఎస్ ఐ లు శ్యాం పటేల్,కళాధర్,కమాన్ పుర ఎస్ ఐ మస్తాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page