సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రమజాన్ మాసం, రంజాన్ పర్వదిన ఉత్సవం ను పురస్కరించుకుని రమజాన్ నెల విశేషాలను అబ్దుల్లా జావేద్ యూట్యూబ్ ఛానల్ చాటి చెబుతోంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో రమజాన్ రోజాల ఉద్దేశం, రమజాన్ నెల ప్రాముఖ్యత, రమజాన్ ఉపవాసాల విశిష్టత, దివ్య ఖుర్ఆన్ సర్వ మానవాళి మార్గదర్శకం, రమజాన్ మహిళ తదితర అంశాల గురించి వివిధ రకాల కార్యక్రమాలు, వివిధ వ్యక్తుల చేత ఉపన్యాసాలను ఈ ఛానల్ అందజేస్తూ, సామాన్య ముస్లింలకే కాదు ముస్లిమేతరులకు కూడా రమజాన్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది.” రంజాన్ రోజే కా మక్సద్ క్యా హై, రమజాన్ కి హికమతే ఔర్ ఫజిలతే, రమజాన్ మే ఖురాన్ కి హిమాయతే , రమజాన్ బదర్ కా వాఖియా, ముఝే టంగ్ నా కరో మేర రోజా హై , ప్యారి అమ్మ మేరీ శాయేరి, మాహే రమజాన్ తేరా షుక్రియా తదితర అంశాలపై అబ్దుల్లా జావేద్ యూట్యూబ్ ఛానల్ లో చిన్న పిల్లలు రూపొందించిన కార్యక్రమాలు జన బాహళ్యానికి అలరించడమే కాకుండా , ఆలోచింప చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న రమజాన్ పై విభిన్న కథనాలు … అబ్దుల్లా జావేద్ యూట్యూబ్ ఛానల్ ప్రతిష్ట ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి.