పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

Spread the love

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన వస్త్రాల కిట్) ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా పేద ముస్లిం కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు, క్రిస్మస్ వేడుకలకు, రంజాన్ వేడుకలకు పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, షౌకత్ అలీ మున్నా, ముజీబ్, షబ్బీర్, ప్రదీప్ రెడ్డి, పోశెట్టిగౌడ్, కరుణాకర్, సలీమ్, అలీ, ఖాజా, కరణ్ సింగ్, బాబాన్, గౌస్, యాకుబ్, అమీర్, జాఫర్, అనిల్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page