హైదరాబాద్: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు.
బంజారాహిల్స్ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు.. మీడియా కంటపడకుండా ఠాణా గేట్లు మూసివేశారు. ఎస్‌ఐబీలో అతనితో పాటు పనిచేసిన ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారులను విచారించి, వాంగ్మూలం నమోదు చేశారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నిస్తున్నారు. డిసెంబరు 4న ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఎవరెవరు సహకరించారని ప్రణీత్‌రావును ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలు, ఐఎంఈఐ నంబర్లు, సీడీఆర్, ఐపీ అడ్రస్‌ల డేటాను సేకరించారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ధ్వంసం చేసి కొత్తవి ఎందుకు అమర్చాల్సి వచ్చిందని ప్రశ్నించగా.. ప్రణీత్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. మరో వైపు వికారాబాద్ అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్‌లను సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణీత్‌ను స్వయంగా తీసుకెళ్లి పడేసిన ప్రాంతంలో పోలీసులు గాలించనున్నారు.
ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…