ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు చెందిన దూదేకుల ఖాదర్ వలీగా పోలీసులు గుర్తించారు. మొదట తీవ్రంగా గాయపడ్డ దూదేకుల ఖాదర్ వలిని కుటుంబ సభ్యులు గిద్దలూరు లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.కానీ అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…