జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’

Spread the love

జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన సదస్సును వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ……

అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుందని, తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్‌ కార్డు డివిజ¬న్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్‌ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుందని తెలిపారు.

ప్రతి ఇంటిని సందర్శించి నేరుగా సమస్యలను స్వీకరించి..
వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్‌ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుందని, అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావాల్సిన పత్రాలు సేకరిస్తారని, వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను వారు దగ్గరుండి పూర్తిచేస్తారని అన్నారు.

సమస్య పరిష్కారమయ్యే వరకు తోడుగా..
ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారని, ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేసి వారిని ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారని అన్నారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారని తెలిపారు.

జూలై 1 నుంచి క్యాంపులు..
మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్‌ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు. జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారని తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page