కామేపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. 200 కుటుంబాలు రాజీనామా.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనన్న బాటలో నడుస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన వారిలో ముఖ్యులు మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన కార్యకర్తలు, అదేవిధంగా బి ఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులైన బండి లక్ష్మీ నర్సు, బండి ఎల్లయ్య, వేముల రాంబాబు, మంజుల చిరంజీవి,బత్తుల రాంబాబు ( పెద్ద రాయుడు ), కాంగ్రెస్ పార్టీకి చెందిన జన్నారపు లింగయ్య మరియుఇంకా కొంతమంది ఇండ్లపై దౌర్జన్యం చేసి బీభత్సం సృష్టించి, భయబ్రాంతులకు గురి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ దుండగుల దౌర్జన్యాలను ఆగడాలను సహించలేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ అంతేకాకుండా కామేపల్లి మండలంలో ఇంకా కొన్ని వందల కుటుంబాలు రాజీనామా చేయనున్నట్లు, వారంతా పొంగులేటి శీనన్న బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు రాజీనామా చేసిన వారిలో వార్డు మెంబర్లు తొండల ముత్తయ్య, మొగిలి విజయ, పిఎసిఎస్ డైరెక్టర్ మేకపోతుల మహేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బానోతు నరసింహ నాయక్, గ్రామ పెద్దలు గుంటుపల్లి వెంకట్రావు, గిరిజన నాయకులు ధరావత్ హరిచంద్ర, బండి లష్మినర్సు, పల్లె ఉపేందర్ రావు, చల్ల వెంకన్న, బత్తుల రాంబాబు ( పెద్ద రాయుడు ), జలగం శ్రీను, బానోత్ లచ్చిరాం, తో పాటు 200 మంది యువకులు పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు భూక్య నాగేంద్రబాబు, వార్డ్ మెంబర్ బానోతు లక్ష్మనాయక్, మాజీ సర్పంచ్ ధారావత్ లాలు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, రాయల నాగ శంకర్,బండి ఎల్లయ్య, మంజుల చిరంజీవి గుగులోత్ సక్కుబాయి, చంద్రు తురకబిక్షం తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page