గుండె తరలింపునకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుచేశారు

Spread the love

కర్మన్‌ఘాట్: బైరామల్‌గూడలోని గ్లోబల్‌ గ్లెనిగల్స్‌ అవేర్‌ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వరకు గుండె తరలింపునకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుచేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ యువకుడు(20) మేళ్లచెర్వు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 12న గ్లోబల్‌ గ్లెనిగల్స్‌ అవేర్‌ ఆసుపత్రిలో చేరారు. బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించడంతో అవయవ దానానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. గుండెను  జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చేర్చారు. 29.1 కి.మీ దూరం 37 నిమిషాల్లో చేర్చారు. రాచకొండ సీపీ, ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. 2.30 గంటలు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు అపోలో వైద్యుడు పీవీనరేశ్‌కుమార్‌ తెలిపారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page