భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన మహోన్నత మూర్తి

Spread the love


A great figure who showed the greatness of India as a world leader

సాక్షిత : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన మహోన్నత మూర్తి, యువతకు ఆదర్శనీయులు శ్రీ స్వామి వివేకానంద 160 వ జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి కార్పొరేటర్లు శ్రీమతి రోజా దేవి రంగరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మందలో ఒకరిగా ఉండకు…వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు…లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి అంటూ.. ఇలా ఒకటేంటి ఎన్నో ప్రసంగాలతో.. మరెన్నో సందేశాలతో యువతను ఆకట్టుకున్న యోగి వివేకానంద అని. భారతదేశ ఖ్యాతిని,

మన దేశ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద అని భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింపచేయడంలో, యువశక్తిని చైతన్యపరచడంలో వివేకానందుడి కృషి అమూల్యం, అనితరసాధ్యం. అని ఆయన సూక్తులు నిత్యం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి అని భవిష్యత్తులోనూ నింపుతాయి అని, ఆయన జయంతిని పురస్కరించుకుని జాతీయ యువదినోత్సవం గా జరుపుకుంటామని ఈ సందర్బంగా గాంధీ తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు , వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు,భగవాన్,మాచర్ల భద్రయ్య, కార్తిక్ రావు,రాంచందర్, హిమగిరి రావు, అల్లం మహేష్, ఎర్ర లక్ష్మయ్య,చంద్రమోహన్ సాగర్, విద్య సాగర్, శేఖర్, జగదీష్ గౌడ్ రవీందర్, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page