ఇష్టపడి చదివితేనే మంచి భవిష్యత్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

A good future is MLC Shambhipur Raju if you like to read it

ఇష్టపడి చదివితేనే మంచి భవిష్యత్
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు


సాక్షిత : ఇష్టపడి చదివితేనే మంచి భవిష్యత్ ఉంటుందని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పట్వారి ఎన్క్లేవ్ వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఐడీపీఎల్ లోని శ్రీవిద్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫ్రెషర్స్ డే వేడుకలకు ఎమ్మెల్సీ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యలో రాణించి ఉజ్వల భవితకు పునాదులు వేసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితంలో ఇంటర్, డిగ్రీ చాలా విలువైనదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను, మీ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఒక పట్టుదలతో చదవాలని సూచించారు.

ఈ సందర్బంగా గత అకాడమిక్ ఇయర్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page