SAKSHITHA NEWS

వరంగల్ జిల్లా:
ఒడిశాలోని మాల్కన్‌గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ మీదుగా 4 కార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఒక్కో ప్యాకెట్లో రెండేసి కిలోలు ఉండే విధంగా 75 ప్యాకెట్లుగా చేసుకొని గుట్టుగా గంజాయి తరలిస్తుండగా అనుమానంతో కార్లను వెంబడించి గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా గంజాయి అక్రమ రవాణా ముఠాను చకచక్యంగా పట్టుకొన్నారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ అలిగేటి మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు పులి రమేశ్ , అల్లం రాంబాబు, పెండ్యాల దేవేందర్,హసన్ పర్తి సిఐ తుమ్మ గోపి, ఎసై నర్సింహారావు , వంశీలు చేజ్ చేసి పట్టుకొన్నారు. ధరవత్ రవి (38), చిలుక సురేష్ (32), గుగూలోతు హరిసింగ్ (45), జటోతూ.చంద్రు (40), జటోతూ. ప్రవీణ్ (21), సలవోద్దీన్ (29), అజాజ్ ఖాన్ (41),షేక్ శమీర్ (28)లను అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి జెస్ట్ కారులో పారి పోయారు……..


SAKSHITHA NEWS