కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజిన్ పరిధిలోని సూరారం మార్కెట్ రోడ్ ఆనంద్ నగర్లో పునర్ నిర్మాణం చేపడుతున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఓపెరటివే చైర్మన్ మన్నే రాజు, మాజి కౌన్సిలర్ బోబ్బా రంగారావు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, పెద్ద వెంకట స్వామి, పందిరి యాదగిరి, రాజ్ కుమార్, చందు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మల్లేష్, నారాయణ, మొగులయ్య, రమేష్, రాజు, రవికుమార్, భాస్కర్, సాయి కుమార్, వెంకటేష్, మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.