SAKSHITHA NEWS

చిట్కుల్ లో పడిన తొలి అడుగు
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొనసాగనున్న తీర్మానాలు..
నీలం వైపే మొగ్గుచూపుతున్న అన్ని కుల సంఘాలు…
నీలం మధు కి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసిన చిట్కుల్ ముదిరాజ్ సంఘం..
బహుజన బిడ్డనే గెలిపించుకుంటాం
గొంతెత్తి జై కొట్టి తీర్మానాలు చేయడానికి ముందుకు వస్తున్న సబ్బండ వర్గాలు

పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ త్రుటిలో చేజార్చుకున్న నీలం మధు ముదిరాజ్ కు సబ్బండ వర్గాల మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది.
బహుజన బిడ్డ నీలం మధు బరిలో ఉండి కొట్లాడాల్సిందే అంటూ అన్ని కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు.


అందుకు అనుగుణంగా వచ్చే ఎన్నికలలో పటాన్ చెరు ఎమ్మెల్యే గా నీలం మధు ముదిరాజ్ కె సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానాలు చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. నీలం మధుకు మద్దతిస్తూ చిట్కుల్ గ్రామంలో తొలి అడుగు పడింది. తమ అభిమాన నాయకుడు నీలం మధు ముదిరాజ్ ని పిలిచి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గారెల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ ముదిరాజ్ సంఘం మూకుమ్మడిగా నీలం మధు కు మద్దతిస్తూ తీర్మానం చేసింది. 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కేసీఆర్ విస్మరించడం సరికాదని గొంతెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి పటాన్చెరు నియోజకవర్గ టికెట్ పై పునరాలోచించుకొని వచ్చే ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ కి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా నీలం మధు ముదిరాజును బరి లోకి దించి గెలిపించుకుంటామని వెల్లడించారు.


నిరంతరం ప్రజాసేవ చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్న నీలం మధుకి సబ్బండ వర్గాల ప్రజలు జై కొడుతున్నారు.
బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ అన్ని బీసీ కుల సంఘాలు నీలం మధు కు మద్దతుగా తీర్మానాలు చేయడానికి రెడీ అవుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అన్ని కుల సంఘాలు తీర్మానం చేసి నీలం మధు కు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి కార్యాచరణ మొదలు పెట్టారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ కులస్తులు అన్ని గ్రామాలలో తీర్మానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా నీలం మధు పోటీ చేసిన సంపూర్ణ మద్దతు ఇస్తూ భారీ మెజార్టీ తో గెలిపించుకుంటామని అన్ని వర్గాల ప్రజలు తేల్చి చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో మన్నే చంద్రయ్య,తలారి నాగేష్, ఉప్పారి నర్సింలు, దుబ్బ రాములు, కట్టమిది మల్లేష్, కట్టమీది వీర స్వామి, నీలం విష్ణు, తలారి శేఖర్, తలారి జంగయ్య, కట్టమిదీ వెంకటేశ్,శ్రీను,రాజు,సంజీవ్,అఖిల్,సంఘం సభ్యులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS