SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 25 at 2.55.01 PM

ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలని,కనీస వేతనంగా 24 వేలు ఇవ్వాలని,డబల్ బెడ్రూం లు ఇవ్వాలని,సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తదితర డిమాండ్లతో గత 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కార్మికుల కు మద్దతుగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో నిలిచి హైదరాబాద్ లో ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది మునిసిపల్ కార్మికులేనని అప్పటి వరకు ఉద్యమ ప్రభావం లేదని దాన్ని వాడుకొని నేడు కేసీఆర్ సీఎం అయ్యాడే కానీ తన స్వతహాగా తెలంగాణ కు ముఖ్యమంత్రి కాలేదని అన్నారు.

ఉద్యమ సమయంలో అందరిని పర్మినెంట్ చేస్తా అని, మునిసిపల్ కార్మికుల పాదాలకు అభిషేకం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోకుండా ఉండటం దొరతననికి నిదర్శనమని అవసరం ఉంటే కాళ్ళు-లేకుంటే జుట్టు పట్టుకునే రకమని విమర్శించారు. దేశంలో ఉన్న బూర్జువా పార్టీలన్నీ వారి ప్రాంతము,మతం,కుటుంబం లేక వ్యాపారాల కోసం లేక వ్యాపారస్తుల కోసమే పనిచేస్తాయని వాటికి కార్మికుల సమస్యలు తెలిసిన ఎన్నికల సమయంలో మాత్రమే కార్మికులు, కార్మిక సమస్యలు గుర్తుకు వస్తాయని కావున అలాంటి బూర్జువా పార్టీలు ఉన్నంత కాలం ప్రజలు మోసపోతుంటారని కావున కార్మికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ తమ సమస్యల కోసం ఎల్లప్పుడూ పోరాడే కమ్యూనిస్టులను గుర్తుకు ఉంచుకొవలని అన్నారు.

ఈ ప్రపంచంలో, దేశంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మికులే అధికారం చెప్పటాలని చెప్పే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమే నని అలాంటి పార్టీ నేడు మునిసిపల్ కార్మికులు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం, జిల్లా అధ్యక్షుడు రాములు, బాబు,నరేందర్ తోపాటు జిహెచ్ఎంసి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


SAKSHITHA NEWS