SAKSHITHA NEWS

సికింద్రాబాద్, ఆగష్టు 7 : మాణికేశ్వరి నగర్ లో స్థానికులు, యూనివర్సిటీ విద్యార్ధులకు, సిబ్బందికి ఉపకరించేలా ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మాణికేశ్వరి నగర్ లో ఆసుపత్రి ఏర్పాటు చేయాలని స్థానికులు కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు. స్థానికులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పరిధిలో పరిష్కరించగల సమస్యలను వెన్వెంటనే పరిష్కరించామని వివరించారు. ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి స్థానికులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు, విద్యార్ధులకు సైతం ఉపకరించేలా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దాంతో ఆందోళనకారులు తమ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కృతఙ్ఞతలు తెలిపారు. స్థానికులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేసి పద్మారావు గౌడ్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షుడు ఆలకుంట హరి, యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, మాణికేశ్వరి నగర్ బస్తీ అధ్యక్షుడు మల్లేష్ తో పాటి అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS