SAKSHITHA NEWS

హైదరాబాద్ :
బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త‌నయుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు మ‌రో కొత్త సాంగ్‌తో అల‌రించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హిమాన్షు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నా కొత్త పాటను జులై 24వ తేదీన విడుద‌ల చేస్తున్నాను
.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని హిమాన్షు పేర్కొన్నారు. ఈ సాంగ్‌ను చూసి మీరంద‌రూ ఆనందిస్తార‌ని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. హిమాన్షు సాంగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు
.

అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్‌ లాసన్ పాడిన గోల్డెన్‌ అవర్‌’ సాంగ్‌ను క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు రావు గ‌తంలో అద్భుతంగా ఆల‌పించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇంగ్లీష్‌ సాంగ్‌ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘం అని నెటిజ‌న్లు కొనియాడిన సంగ‌తి తెలిసిందే. అచ్చం జాకబ్‌ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్‌ సాంగ్‌ పాడాడ‌ని ప్ర‌శంసించారు. 24న విడుద‌ల కాబోయే సాంగ్ కూడా ఆ మాదిరిగానే ప్ర‌శంస‌లు అందుకోవాల‌ని నెటిజ‌న్లు ఆశిస్తున్నారు……..


SAKSHITHA NEWS