SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 15 at 4.38.08 PM

హైదరాబాద్
నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్‌డీవోలతో పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాలను కడిగిన ముత్యంలా చేశారన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలలో 6,544 గ్రామ పంచాయతీలకు భవనాలు ఉన్నాయన్నారు. మిగతా 6 వేల 225 గ్రామ పంచాయతీలలో నిధులు మంజూరు చేయగా నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

హరితహారం లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ కు 6.7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిగతా మొక్కలను కూడా త్వరగా నాటాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు…


SAKSHITHA NEWS