SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 08 at 5.54.46 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారికి GO . NO . 58 ద్వారా యజమాని హక్కుల ను కలిపిస్తూ అర్హులైన 228 మంది లబ్ధిదారులకు తహశీల్దార్ వంశీ మోహన్ , కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో నెంబర్ 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా 59 జి.ఓ కింద ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని సైతం పొందారు అని. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న స్థల వివాదాలు సమస్యలో పేద మధ్య తరగతి కుటుంబాలు మరియు నివసిస్తున్న స్థలాలకు కూడా యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నాయకత్వంలో ఇది ఒక గొప్ప అవకాశం కలిపించింది అని ఈ అవకాశాని వినియోగించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పేద మధ్య తరగతి కుటుంబాలలో కనిపిస్తున్నా సంతోషం మాటలో చెప్పలేనిదని తెలియజేసారు సంక్షేమం అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల సంఖ్య కాదు పేద కుటుంబాలలో కనిపించే ఆనందం అని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరుకు తెలంగాణ ప్రజల జీవన విధానంలో మెరుగైన జీవనాన్ని అందించడానికి చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు RI శ్రీకాంత్, RI శ్రీనివాస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS