భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న, మన, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే, మెచ్చా
యాంకర్ వాయిస్
అశ్వారావుపేట(మండలం)లోని వేదాంతపురం(82) ఊట్లపల్లి (380) కేసప్పగూడెం(157) పంచాయతీలలో మొత్తం 618 పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా,ప్రతి ఒకరు ఆనందంగా తమ పాస్ పుస్తకాలు తీసుకున్నారు.అలాగే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సమక్షంలో మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన గిరిజన బాషలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని,పాస్ పుస్తకాలు, ఇవ్వటమే కాకుండా రైతు బందు కూడా ఇస్తున్నారని,పోడు భూమి విషయంలో ఫారెస్ట్వారు, పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని అధికారులను ముఖ్యమంత్రి,ఆదేశించారని,దేశానికే మన తెలంగాణ,ఆదర్శమని,అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ,జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, యూఎస్ ప్రకాష్ రావు, సత్యవరపు సంపూర్ణ, కోడూరు నాగేశ్వరరావు, ఎంపీటీసీ రామకృష్ణ, సర్పంచులు సోమని శివశంకర ప్రసాద్, కొమరం బాబురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.