ఆదిత్యుని ఆలయ హుండీ ఆదాయ వివరాలు
శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామివారి హుండీలు గురువారం లెక్కించారు.నోట్లు రూపంలో రూ.49,61,426, చిల్లర రూపంలో రూ.1,79,343, మొత్తం రూ. 51,40,769లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. అలాగే బంగారం 53గ్రా, వెండి 4.100 కేజీలు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపంలో అమెరికా డాలర్లు 21, సుడాన్ పౌండ్స్ 50, రియల్స్ 6, దిరహమ్స్ 10, రింగ్లిట్స్ 12 వచ్చాయని తెలిపారు.