శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున : నిర్మాణానికి రూ 25,116 విరాళం.
కందుకూరు పట్టణానికి చెందిన పెరుగు రమణయ్య ధర్మపత్ని రత్తమ్మ, కుమారుడు శ్రీనివాసులు ధర్మపత్ని రమణమ్మ గార్లు కందుకూరు పట్టణ గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున : నిర్మాణానికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గారి సమక్షంలో 25,116 లను కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, ఆవుల మాధవరావు లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణానికి ఇప్పటివరకు అనేకమంది భక్తులు, దాతలు కానుకల రూపంలో నగదును అందజేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ తల్లి దీవెనలు వెళ్లవేళల ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెరుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.