SAKSHITHA NEWS

తిరుపతి జిల్లా సత్తి వేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీ ముట్టంగి తిప్ప గిరిజన కాలనీకి శివుని గుడికి బడులుకు అడ్డంగా చెన్నైపురావస్తు శాఖ వారు ప్రహరీ గోడ నిర్మించడానికి జెసిబి టిప్పర్ లో ఇతర యంత్ర సామాగ్రిని తీసుకొని సోమవారం ఉదయం రాగా సిపిఐ నాయకులు గిరిజన అడ్డుకొని తిప్పి పంపడం జరిగింది అనంతరం గిరిజనులు సిపిఐ ఆధ్వర్యంలో వరదయ్యపాలెం తాసిల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం ధర్నా పోరాటం చేశారు
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ 1947లో ప్రభుత్వం పురావస్తు శాఖ వారికి 65 ఎకరాల భూమిని కేటాయించిందని భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు తమిళనాడుకు చెందిన పంకజం కుమార్ కు పురావస్తు శాఖ కాంట్రాక్ట్ ఇచ్చిందని గోడ కట్టే తీరుతామని కాంట్రాక్టర్ పంకజం కుమార్ కు సంబంధించిన మనుషులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులు పేదలపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని చిన్ని రాజ అన్నారు


ఇటీవల సూళ్లూరుపేట ఆర్డీవో పురావస్తు శాఖ కు కేటాయించారు అనబడే అనబడే భూములను గ్రామంలోని అంగన్వాడి మరియు ప్రాథమిక పాఠశాల ఇటీవల ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇళ్ల కాలనీ డంపింగ్ యార్డ్ గిరిజన కాలనీ సుబ్బానాయుడు కండ్రిక గ్రామం క్షేత్రస్థాయిలో పరిశీలించి తిరుపతి కలెక్టర్ కి నివేదిక సమర్పిస్తామని తిరుపతి కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి ఉత్తర్వులు అనంతరమే పురావస్తుశాఖ వారికి భూములు కేటాయించేది లేనిది జరుగుతుందని అప్పటివరకు ఇక్కడ ఎలాంటి పనులు చేయవద్దని గిరిజనులు ప్రభుత్వ వారి దగ్గరుండి అసైన్మెంట్ పట్టాలు పొందిన పేదలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిశ్చింతగా ఉండని హామీ ఇవ్వడం జరిగింది
అయితే ఈరోజు మళ్లీ పురావస్తు శాఖ వారిచే కాంట్రాక్ట తీసుకున్నవారు ఇక్కడ వరకే గోడ కడతావు అదో అక్కడ వరకే గోడ కడతావు అని మళ్లీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని చిన్ని రాజ్
ఆవేదన వ్యక్తం చేశారు
తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందు గజట్ నోటిఫికేషన్ ఇస్తే 70 సంవత్సరాలు అవుతున్న ఒక్కసారి కూడా పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో పరిశోధన నిర్వహించకుండా ఈ భూములలో అనేక మంది స్థిర నివాసం ఏర్పరచుకోగా రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వగా ప్రజల అనుభవంలోకి వచ్చిన భూములను ఇప్పుడొచ్చి మావి అంటే ఎలా కుదురుతుంది అని అని ఆయన ప్రశ్నించారు
ప్రజల అనుభవంలోకి వచ్చిన భూములను ప్రజలక ఇవ్వాలని పురావస్తు శాఖ వారి వద్ద ఉన్న చల్లని గజట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని అంబాకం చిన్ని రాజు డిమాండ్ చేశారు
ఈ ధర్నా పోరాట కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మీనాక్షి అంకమ్మ సిపిఐ నాయకులు తరుణ్ కుమార్ మురళి స్థానికులు ధనుంజయులు శెట్టి పోలా అంకమ్మ తుపాకుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS