26న సీఎం జగన్‌ అనంత పర్యటన

Spread the love

అనంతపురం అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్‌ గౌతమి తెలిపారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. సీఎం పర్యటనపై కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.

Related Posts

You cannot copy content of this page