చందనోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున
విశాఖపట్నం
ఈ నెల 23వ తేదిన జరగబోవు చందనోత్సవాల్లో సామాన్య భక్తు లకు ఎటువంటి లోటుపాట్లు జరగ కుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు సింహచల కొండపై ఆనంద నిలయం లో చందనోత్సవ ఏర్పాట్ల పై పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చందనోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేది తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.30 మద్య ఆలయ ధర్మకర్త మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు దేవాదాయశాఖ మంత్రి వర్యులు స్వామివారిని దర్శించు కుంటారని అదే సమయంలో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు అనంతరం 3.30 నుండి 4.30 గంటల మధ్య వివిఐపి దర్శనాలు దేవస్థాన ట్రస్టు సభ్యులు స్వామి వారిని దర్శించు కుంటారన్నారు రూ 300/-లు, రూ 1000/-మరియు రూ1500/- టిక్కెట్లలో దర్శన టైమింగ్స్ ను ముద్రించడం జరుగుతుందన్నారు తెల్లవారుజామున 4.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు ఉచిత దర్శనంతో పాటు రూ.300/- మరియు రూ.1000/- దర్శనం టైమింగ్స్ తో కూడిన టిక్కెట్ల పై భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు అదే విధంగా వివిఐపి లు స్లాట్ 1 ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల మధ్య స్లాట్ 2 ఉదయం 8.00 గంటల నుండి 10.00 మధ్య దర్శన ఏర్పాట్లు చేయడం జరుగు తుందన్నారు మీడియాను ఉదయం 5.00 నుంచి 7.00 గంటల మధ్య దర్శనం ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి 20 మీటర్లకు ఒక వాటర్ పాయింట్ ను దేవస్థానం మరియు జివిఎంసి ఏర్పాటు చేస్తున్నాయన్నారు టాయిలెట్స ఏర్పాటు,శానిటేషన్ పనులను జివియంసి చేపట్టిం దన్నారు భక్తులు రదీగా ఉండే ప్రదేశాలను గుర్తించి అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు నడక మార్గంలో కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు ఉండేలా అవసరమైన చర్యలు విద్యుత్తు శాఖ చేపట్టిందని కలెక్టర్ అన్నారు పోలీసు కమిషనర్ డాక్టర్ సి.ఎం. త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ భక్తులు అధికంగా ఉండే రద్దీప్రాంతాలను ముందుగా గుర్తించడం జరిగిందని అటువంటి చోట్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోభస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు కొండ దిగువన వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు కొండ పైన కామన్ కామాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగ కుండా పర్యవేక్షించడం జరుగు తుందన్నారు ఈ సమావేశంలో సింహాచల ఇఒ త్రినాదరావు చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ అజాద్,డి.సి.పిలు ఆనందరెడ్డి,వి.నాగన్న,విద్యాసాగర్ నాయుడు,సంబంధిత శాఖల అది కారులు పాల్గొన్నారు.