SAKSHITHA NEWS

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 25వ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

20వ డివిజన్ కేజీఎం కాకతీయ నగర్, ఎస్వీఎస్ ఆభరణ కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 25వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా 20వ డివిజన్ లోని కేజీఎం కాకతీయ నగర్, ఎస్వీఎస్ ఆభరణ కాలనీలలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి పాదయాత్ర చేస్తూ ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం రూ.1 కోటితో పూర్తి చేసిన ఎస్.ఎన్.డి.పి నాలా పనులు, రూ.27 లక్షలతో పూర్తి చేసిన భూగర్భడ్రైనేజీ పనులు పరిశీలించారు. అనంతరం భూగర్భడ్రైనేజీ పూర్తి కావడంతో సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే ని కోరగా.. రూ.57 లక్షలు మంజూరు చేసి త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యలనైనా అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏమాత్రం లేదన్నారు. రాబోయే రోజుల్లో కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. చివరగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీలో పూర్తిగా మహిళలే ఉండడంతో ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్లు ఆగం రాజు, చిట్ల దివాకర్, విజయ లక్ష్మి వెంకట సుబ్బారావు, సుజాత, కోఆప్షన్ మెంబర్ సయ్యద్ సలీం, ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, చంద్రగిరి సతీష్, 20వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సంధ్యా రాణి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఛాయా, ప్రధాన కార్యదర్శి ప్రదిమ మరియు నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS