SAKSHITHA NEWS

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని అవంతిక గోదావరి హోమ్స్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ లో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో చెరువు వద్ద కడుతున్న మురుగు నీటి పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని,కొత్తగా ఏర్పడిన మా కాలనీ లో మంజీర మంచి నీటి వసతి కలిపించాలని, రోడ్లు, డ్రైనేజి విధిదీపాలు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.

దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
కాలనీ లో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని,మంజీర మంచీ నీటి వసతిని త్వరలోనే కలిపిస్తామని దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ మరియు అవంతిక గోదావరి కాలనీ వాసులు కిరణ్ కుమార్ , శ్రీ హర్ష,సాయి కృష్ణ, సంతోష్,దేబాసిస్, కిరణ్, కైలాష్,రామకృష్ణ, నాగలక్ష్మి ,కీర్తి వర్మ, కళ,సత్య,సాహిత్య, దివ్య
మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS