ఖమ్మం జామా మస్జీద్ కు మంత్రి పువ్వాడ విరాళం..

SAKSHITHA NEWS

Minister Puvvada donates to Khammam Jama Masjid..

ఖమ్మం జామా మస్జీద్ కు మంత్రి పువ్వాడ విరాళం..
2లక్షల రూపాయల నగదును మత పెద్దలకు అందజేసిన మంత్రి పువ్వాడ.
హర్షం వ్యక్తం చేసిన ముస్లిం మైనారిటీ నాయకులు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జామా మసీదును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ మత పెద్దలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పలు సమస్యలపై నివేదించారు. తక్షణమే స్పందించిన మంత్రి అజయ్ కుమార్ మస్జిద్ అభివృద్ధి కోసం పువ్వాడ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయల నగదును ప్రకటించారు.

ప్రకటించిన ఆయా నగదును నాడు తన క్యాంపు కార్యాలయం నందు మత పెద్దలకు అందజేశారు. అదేవిధంగా మస్జీద్ ప్రహరీ గోడ నిర్మాణానికి అంచనా వ్యయం వేసి ఇవ్వాలని మంత్రి అజయ్ కుమార్ జామా మస్జీద్ మత పెద్దలను కోరారు. తమ మస్జీద్ అభివృద్ధి కోసం తక్షణమే స్పందించి 2 లక్షలు ఇచ్చిన మంత్రి అజయ్ కుమార్ కి జామా మస్జీద్ మత పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జామా మస్జీద్ మత పెద్దలు ఇమామ్ సాబ్ అజీజ్, అబ్దుల్ ముబీన్, మహమూద్ ఆశ్రిఫ్, తాజుద్దీన్, ముక్తర్, ఇస్సాక్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page