ఏసీబీ వలలో ఆర్ డబ్ల్యూఎస్ జేఈఈ

Spread the love

RWS JEE in ACB net

ఏసీబీ వలలో ఆర్ డబ్ల్యూఎస్ జేఈఈ

బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్

ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు ఏం బుక్ ఎంటర్ చేసి, బిల్లులు మంజూరు చేయడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటూ దత్తిరాజేరు మండలం ఆర్. డబ్ల్యూ. ఎస్ జే ఈ ఈ ధనుంజయరావు ఏసీబీ అధికారుల వలలో పడ్డారు.

విజయనగరంలోని ఉడా కాలనీ గౌతమీ నగర్ అపార్ట్మెంట్లోని ఆయన నివాసం గ్రౌండ్ ప్లోర్ లో బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస సర్పంచ్ భర్త కర్రోతు శ్రీనివాసరావు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు మేరకు
ధనుంజయ రావు గతంలో బొండపల్లి మండలంలో ఆర్ డబ్ల్యూ ఎస్ జేఈఈ గా పని చేసిన కాలంలో మరువాడ కొత్తవలస సర్పంచ్ భర్త కర్రోతు శ్రీనివాసరావు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశారు.

వాటికి సంబంధించిన ఏం బుక్ రికార్డుల్లో ఎంటర్ చేసి, బిల్లులు మంజూరు చేయాల్సిన జేఈఈ ధనుంజయ్ రావు అటు తరువాత దత్తిరాజేరు మండలంకి బదిలీపై వెళ్లిపోయారు.

అప్పటి నుంచి ఆ బిల్లులు పెండింగ్ లో ఉండి పోవడంతో శ్రీనివాసరావు, జేఈఈ ధనుంజయ రావును సంప్రదించగా ఆయన రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page