SAKSHITHA NEWS


The District Collector inspected the process of moving EVMla Godau

ఈ.వి.ఎంల గోడౌను తరలిస్తున్న ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పాత కలెక్టరేట్ ఆవరణలో గల ఈ.వి.ఎంల గోడౌను జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని గౌడౌన్కు తరలిస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంను వైద్య కళాశాలకు కేటాయించిన సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో గల ఈ వి.ఎం గోదాములో ఉన్న ఈ. వి. ఎంలను శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు..

అదే విధంగా జిల్లాకు నూతనంగా వచ్చిన 2603 బ్యాలెట్ యూనిట్ లు, 2034 కంట్రోల్ యూనిట్ లను జడ్పీ లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చి సిసి పుటేజీలను కలెక్టర్ పరిశీలించారు. ఈ.వి.ఎం గిడ్డంగుల వద్ద విధులు నిర్వర్తించే పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సి.సి.టి.వి కెమెరాల ద్వారా పరిశీలిస్తుండాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంధ్రనాద్, సూర్యనారాయణ, ఈ.సి.ఐ.ఎల్ ఇంజనీర్లు బానుప్రకాష్, రాజుశేషు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఇ.ఇ పంచాయితీరాజ్ కె.వి.కె. శ్రీనివాసరావు, ఎలక్షన్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు,రాంబాబు


రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఆర్.ఎస్ పార్టీనుండి పగడాల నాగరాజు, బి.జె.పి పార్టీ నుండి విద్యాసాగర్, కాగ్రెస్ పార్టీ నుండి గోపాల్రావు, వై.సి.పి పార్టీ నుండి కృష్ణమోహన్, సి.పి.ఐ పార్టీ నుండి లక్ష్మీనారాయణ, సి.పి.ఎం పార్టీ నుండి ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS