The role of newspapers in solving social problems is crucial
సామాజిక సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర కీలకం
సాక్షిత ప్రతినిధి. ప్రజా సమస్యల పరిష్కారానికై అలుపెరుగని అక్షర పోరాటం చేస్తున్న వుదయం దినపత్రిక. బీటీవీ. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం.వుదయం దినపత్రిక. బీటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్.ఎడ్మ సత్యం.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో వుదయం దినపత్రిక. బీటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ యంగ్ డైనమిక్ లీడర్ కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ఎడ్మ.సత్యం.ఆవిష్కరించారు .ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర చాలా కీలకమని స్వాతంత్రానికి ముందు తెల్లదొరల పాలన ఆర్థిక దోపిడీ నుండి ప్రజలను చైతన్యపరిచి వారి నుండి విముక్తి కలిగించి స్వేచ్ఛ స్వయంపాలన స్వాతంత్రం సిద్ధించడంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని స్వాతంత్ర్య అనంతరం కూడా దేశం పునర్నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ స్టేట్ గా కీర్తించబడటం గర్వకారణం అని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం అన్నారు .
ఈ సందర్భంగా వుదయం.బీటీవీ.క్యాలెండర్2023నుఆవిష్కరించారు.సమాజంలో నెలకొని ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలను ఎప్పటికప్పుడు అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో ప్రజలకు ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికలుకీలకపాత్రపోషిస్తున్నాయనిఅన్నారు .ప్రస్తుతం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వాటి రూపుమార్చుకుంటూ డిజిటల్ రూపంలో కూడా పత్రికలు దూసుకుపోవడం ప్రజాస్వామ్య స్వేచ్ఛకు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం అన్నారు.
జర్నలిస్టు సోదరులకు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి. 21 వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్. నూనె శ్రీను. మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాము. 21 వార్డ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్. వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్. 14వ వార్డు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ ఏజాజ్ అలీ. సుల్తాన్ తెలంగాణ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు రావుల శ్రీనివాస్.
కార్యదర్శి నాసు వెంకటేష్. నియోజకవర్గ అధ్యక్షుడు నరేందర్. అక్షర పింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్. హబీబ్ అహ్మద్. ప్రాంతం దినపత్రిక రిపోర్టర్ ఇబ్రహీం. ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.