Invitation to CM family members
సీఎం కేసీఆర్ సతీమణి శోభ మరియు కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసిన దేవస్థానం కమిటీ
జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వసంత పంచమి రోజున జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనాన్ని తిలకీంచేందుకు రావాలంటూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మరియు వారి కుమార్తె అయినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు దేవస్థానం ఆహ్వాన పత్రికలను అందజేసింది.
ఈ మేరకు దేవస్థానం ఈవో పురంధర్ కుమార్ ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు ఆనంద శర్మ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మరియు అమ్మవారి శేష వస్త్రాలను ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేస్తూ వారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జోగులాంబ ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన అదేవిధంగా అక్కడ నెలకొన్న సమస్యలపై మాట్లాడుతూ అమ్మవారి ఆలయంపై ఆమెకు ఉన్నటువంటి భక్తిని చాటుకున్నారు.
26వ తేదీ వసంత పంచమి రోజు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునే విషయంలో సీఎం కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు జయన్న విష్ణువర్ధన్ రెడ్డి హరిబాబు ఆలయ మాజీ ధర్మకర్త వెంకట నరసింహారెడ్డి మరియు నరేందర్ ఉన్నారు..