Council meeting in Khammam Municipal Corporation
ఖమ్మం నగరపాలక సంస్థ లో కౌన్సిల్ సమావేశం
-పాల్గొన్న ప్రముఖులు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశము బుధవారం నగర మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశ కౌన్సిల్ హాల్ నందు నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర సురభితో కలిసి నిర్వహించడమైనది. ఇట్టి కౌన్సిల్ సమావేశంలో 11 ఎజెండా అంశములకు సంబంధించి కార్పోరేటర్లు ఎక్స్ అఫిసియో సభ్యుల సమక్షంలో ఆమెదం తెలిపినారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందత్వం లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేంకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జనవరి నెల 18 నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఈ కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో కార్పోరేటర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ ను ఎలా అయితే వందశాతం చేయించగలిగారో అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకునేలా చూడాలన్నారు.
నగరంలో సేకరించిన చెత్తను ఇప్పుడు కొత్తగా చేసే దానిలో భాగంగా బయోమైనింగ్ వర్క్ స్టార్ట్ అయినందున అక్కడున్న వేస్ట్ అంతాకూడా సెంటిఫిక్ మెత క్లియర్ చేసిన తరువాత ప్రాపర్‌గా సెగ్రిగేషన్ చేయడం జరుగుతుందని, మేయర్ తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరం అనతి కాలంలో మంచి అభివృద్ధి చెందిందని, ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.
రాష్ట్రం, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను తెప్పించుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగిందని, కేంద్రం నుండి. రావాల్సిన నిధులను తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వానిజ్య సముదాయాల నుండి, హెూటల్స్, ఫంక్షన్ హాల్స్ నుండి చెత్తను సేకరించేందుకు ఆగష్టు నెల నుండి ప్రారంభించడం జరిగిందని,
నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో బల్క్ జనరేటర్స్‌ను ఏర్పాటు చేసుకొని వర్కర్స్‌ను ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకొని గాంధీచౌక్, ఓల్డ్ బస్టాండ్ సెంటర్, జడ్పీ, మమతరోడ్, శ్రీశ్రీ సర్కిల్, గట్టయ్య సెంటర్, ఎన్.టి.ఆర్ సర్కిల్‌లలో 58 మంది లేబర్‌ను డ్రైవర్లు, చెత్తసేకరణ, శానిటేషన్ సిబ్బందిని ఎంగెజ్ చేసుకోవడం జరిగిందిని వారికి కంపెని చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
కౌన్సిల్ సమావేశంలో కార్పోరేటర్లు, పాలేరు శాసనసభ్యులు, సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ కె.మల్లీశ్వరి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.