Collector’s offices have become collection offices
కలెక్టర్ ఆఫీసులే కలెక్షన్ల కార్యాలయలుగా మారాయి
షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ “వీర్లపల్లి శంకర్”
టిఆర్ఎస్ విస్మరించిన హామీలపై కాంగ్రెస్ నిరసన దీక్ష
రైతు రుణమాఫీ ధరణి పోర్టల్ తదితర సమస్యలపై ఆందోళన
ఆర్డీఓ రాజేశ్వరికి వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ పార్టీ
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
కలెక్టర్ ఆఫీసులే కలెక్షన్ల కార్యాలయలుగా మారాయని, ధరణి పేరిట రైతుల వద్ద విచ్చలవిడిగా ప్రభుత్వ అధికారులే పాలకులకు అక్ర మార్గంలో దోచిపెడుతున్నారని
,
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైన పాలనను కాంగ్రెస్ పార్టీ అంతమొందించడం ఖాయమని, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూముల పట్టా, పంట నష్టపరిహారం,
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఐదు డిమాండ్లపై ప్రధానంగా నిరసన దీక్ష సాగింది. ఈ సందర్భంగా సమస్యలను నివేదించి ధర్నా అనంతరం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో అధికారి రాజేశ్వరికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ..
గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గెలిచాక చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ రద్దు చేయకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందేనని అదేవిధంగా పంట నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని,
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని పలు డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మరియు అనుబంధ సంఘాలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.