HMT will work to solve the problems of the workers
హెచ్ఎంటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
హెచ్ఎంటీ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బెంగళూరు, కేరళ, హైదరాబాద్, పింజోర్, అజ్మీర్ లలో హెచ్ఎంటీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు
. రిటైర్డ్ అయిన కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు, ఉదా పీఎఫ్, గ్రాట్యుటీ తదితర సదుపాయాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ని కోరారు. 1997లో ఉన్నటువంటి జీతాలనే ఇప్పటికీ చెల్లిస్తున్నారని, గత 5 నెలలుగా జీతాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని, పింజోర్ లో గత సంవత్సరం నుండీ జీతాలు చెల్లించక పోవడంతో ఆర్థికంగా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఎమ్మెల్యే కి వివరించారు
. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే డిహెచ్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్) మినిస్టర్ గా ఉన్న మహేంద్ర నాథ్ పాండే ని జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి సమస్యలు తీసుకువెళ్ళి, పార్లమెంట్ లో లేవనెత్తి పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారు.
ఈ సమావేశంలో బెంగళూరు హెచ్ఎంటీ యూనియన్ జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్, సత్యనారాయణ, ఆనంద్ రావు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.