మోడల్ గా నిలిచేలా కాలేజి భవనాలు

Spread the love

Model college buildings

మోడల్ గా నిలిచేలా కాలేజి భవనాలు


సాక్షిత : సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో రూ. 29.75 కోట్ల భారీ ఖర్చుతో ప్రతిపాదిస్తున్న ప్రభుత్వ హై స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజీ ల నూతన భవన సముదాయాల నిర్మాణాన్ని తెలంగాణ లోనే మోడల్ గా చేపట్టాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలీక్టరేట్ అధికారుల బృందం గురువారం సితాఫలమండీ లో ప్రతిపాదిత ప్రాంగణాన్ని పరిశీలించింది. జిల్లా ప్రధాన ప్లానింగ్ అధికారి డాక్టర్ సురేందర్ నేతృత్వంలో ఇంజినీరింగ్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పద్మారావు గౌడ్ ఎ సందర్భంగా వారికీ నిర్మాణ తీరుతెన్నుల పై దిశా నిర్దేశం చేశారు.

ప్రధానంగా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని భవనాలను, తరగతి గదులు, లేబోరేతరీలు, లైబ్రరీ, ఆడిటోరియం, క్రీడల ప్రాంగణం తదితర అంశాలను ఏర్పాటు చేయాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page