తెరాసలో చేరిన సీనియర్ నేత సంజీవ్ ముదిరాజ్, ఆహ్వానించిన ఉప సభాపతి

Spread the love

Sanjeev Mudiraj, a senior leader who joined the Teras, was cordially invited as the vice president

తెరాసలో చేరిన సీనియర్ నేత సంజీవ్ ముదిరాజ్, సాదరంగా ఆహ్వానించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్


సాక్షిత సికింద్రాబాద్ : బౌద్దనగర్ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సంజీవ్ ముదిరాజ్ తెరాస పార్టీ లో చేరారు. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సమక్షంలో సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో సంజీవ్ ముదిరాజ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి తెరాసలో చేరారు.

వారికీ తెరాస ఖండువాలు కప్పి పద్మారావు గౌడ్ సాదరంగా తెరసలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల నుంచి తమకు మంచి ఆదరణ లభించడం ఆనందాన్ని కలిగిస్తోందని,

వారి ఆకాంక్షలకు అనుగుణంగా తాము పని చేస్తున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెరస యువ నేత తీగుల్ కిషోర్ కుమార్ గౌడ్, నేతలు శేఖర్, సుంకు రామచందర్, తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page