SAKSHITHA NEWS


Inspected sewage line bucket cleaning works along with officials

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్ కాలనీ లో జలమండలి అధులికారులతో కలసి సీవరేజ్ లైన్ బక్కెట్ క్లీనింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, జలవాయు విహార్ కాలనీ వాసులు వర్షాలు పడుతున్నప్పుడు కాలనీ లో వర్షపు నీరు మరియు డ్రైనేజ్ నీరు కలసి కాలనీ లో పొంగి పోతూ కాలనీ వారి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా, శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఆరేకపూడి గాంధీ తో కలసి అధికారులతో చర్చించి బక్కెట్ క్లీనింగ్ ను జలమండలి ద్వారా ఏర్పాటు చేయించి,

పనులను మొదలు పెట్టాము అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర,, కాలనీ వాసులు సుబ్బయ్య, తేజొరాం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS